చిలకటోనిపల్లి గ్రామ అంగన్వాడీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలి
ఐసిడిసి సూపర్ వైజర్ నాగమణి
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి లోని అంగన్వాడీ కేంద్రాలలో శనివారం అత్యంత ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వ హించారు. ఐసీడిసీ సూపర్ వైజర్ నాగమణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా నాగమణి మాట్లాడుతూ... తల్లిపాల వారోత్సవాలను వారం రోజులపాటు నిర్వహిస్తున్నమని తెలిపారు. తల్లి పాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఆమె చెప్పారు. గర్భవతులు సీజనల్ గా దొరికే విటమిన్ సి కలిగిన పోషకాహారం ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవడం వల్ల పెంచుకోవచ్చు, నిమ్మ జాతి పండ్లను తీసుకోవాలని వాడు తెలిపారు. పాలు, గుడ్డు, వేరుశనగలు, బెల్లం తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుందని ప్రతిరోజు ఆహారంతో పాటు ఐ వాట్ని తీసుకోవడం అలవర్చుకోవాలని వారు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని వారు సూచించారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు తా గించకూడదని నాగమణి తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోనే తల్లియొక్క పసుపు రంగు యొక్క చిక్కటి పాలు (ముర్రుపాలు) అమృతం లాంటివని ఆమె పేర్కొన్నారు. వీటి ద్వారా బిడ్డకు అతిముక్యమైన పోషకాలు లభి స్తాయని తెలిపారు. తల్లిపాలు బిడ్డ శరీరానికి, మెదడు కూడా పోషణను ఇస్తుందన్నారు. తల్లి పాలలో వున్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలల్లో వుండవని నాగమణి స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా తల్లిపాలు శిశువును న్యుమోనియా, అతిసార వ్యాధి వంటి ప్రమాధ కరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమములో ఏఎన్ఎం తారాదేవి, అంగన్ వాడీ ఉపాధ్యాయురాలు గొంది మంజుల, ఆశా వసంత, ఆయా ఎం అంజమ్మ, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశాలు, తల్లులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments