నాచారంలో అనాహా డెర్మా & ఆర్థో క్లినిక్ ప్రారంభోత్సవం
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నాచారం, తెలంగాణ ముచ్చట్లు:
నాచారం డివిజన్ లో అనాహా డెర్మా & ఆర్థో క్లినిక్ లో చర్మ సంబంధిత సమస్యల కొరకు అలాగే ఆర్తో సంబంధిత సమస్యల కొరకు నాచారం ప్రధాన రహదారిపై అనాహా డెర్మా & ఆర్థో క్లినిక్ ప్రారంభోత్సవం ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించడం జరిగింది.
డాక్టర్ సుష్మ సుకృతి ఎంబిబిఎస్, ఎండి-డివిఎల్ (ఓస్మానియా), డిఎన్బ డ్యూయల్ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ , డాక్టర్ డి. ప్రదీప్ వర్మ,ఎంబిబిఎస్, ఎంఎస్ -ఆర్థో,ఎఫ్ఐజెఆర్ లో కలిసి ఈ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నాచారం లో ఈ క్లినిక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని తెలియజేశారు. పేద పేషెంట్లు వస్తే వారికి వీలైనంత తక్కువ ఖర్చులో వైద్యం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సామల రఘు ప్రసాద్, సామల రంగ , శ్రీలత, బిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, కాలేరు జై నవీన్ ,కట్ట బుచ్చన్న గౌడ్,విటల్ యాదవ్ , రామచందర్ ,సంపత్ యాదవ్, యూసుఫ్ మక్బూల్, సుగుణాకర్ రావు ,వాసు నరసింహ శివ చంద్రశేఖర్ ఈశ్వర్ యాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments