తాటికాయల గ్రామంలో ఘనంగా కడియం జన్మదిన వేడుకలు

తాటికాయల గ్రామంలో ఘనంగా కడియం జన్మదిన వేడుకలు

ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉప  ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాస్క రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,
కడియం అభిమానుల మధ్య  మధ్య కేక్ కట్ చేసి, అరటి పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయకర్త, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్క రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కడియం శ్రీహరి నాయకత్వంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని కొనియాడారు.WhatsApp Image 2025-07-08 at 3.30.35 PM (1)WhatsApp Image 2025-07-08 at 3.31.18 PM ఆయన ప్రజాసేవ, పరిపాలన అనుభవం ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికి చేరుతుందన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బొల్లెపాక అన్నపూర్ణ కుమార్, గ్రామ శాఖ సెక్రటరీ శివకృష్ణ, సీనియర్ నాయకులు కనుకటి యాదగిరి, తొట్టె సదయ్య, చెల్లోజు రాజు, పెసరు బొందయ్య, నీల రమేష్, యూత్ అధ్యక్షుడు పట్ల మహేష్, నల్ల మొగిలి, చెరుకు రమేష్, నల్ల అశోక్, పెసరు శ్రీనివాస్, పెసరు కుమార్, పట్ల యాకుబ్, బొల్లెపాక ప్రవీణ్, పట్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .