ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీరును కలిసి వినతి
మంజూరైన పనులకు టెండర్లు ఆమోదించి ప్రారంభించాలని విజ్ఞప్తి
Views: 2
On
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లను ఆమోదించి వర్క్ ప్రారంభించాలన్న అభ్యర్థనతో జీహెచ్ఎంసీ నిర్వహణ విభాగం చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టెండర్ ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సానుకూలంగా స్పందించిన చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్, టెండర్ ప్రక్రియ తక్షణమే ప్రారంభించి పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయి జెన్ శేఖర్, గంధం నాగేశ్వర్ రావు, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments