వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధే ప్రభుత్వ సంకల్పం

4170 కోట్ల రూపాయలతో భవిష్యత్ లక్ష్యాలతో 

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధే ప్రభుత్వ సంకల్పం

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 
మామునూరు విమానాశ్రయం అభివృద్ధి

మెగా టెక్స్‌టైల్ పార్క్, భద్రకాళి ఆలయ పునర్నిర్మాణం పై సమీక్ష

హైద‌రాబాద్‌, తెలంగాణ ముచ్చట్లు:

చారిత్రాత్మ‌క ప్రాధాన్యమున్న వరంగల్ నగరాన్ని భవిష్యత్తులో రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేసింది. ఈ దిశగా నగర స‌మ‌గ్రాభివృద్ధికి అనేక ప్రాధాన్య ప్రాజెక్టులు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.
శనివారం  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేంపల్లి నరేందర్ రెడ్డి అధ్యక్షతన, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లాకలెక్టర్లు, ఎస్పీలతో కలిసి వరంగల్ అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.

విశాల ప్రణాళికలు,కీలక అంశాలు:

వరంగల్ నగరానికి 2057 నాటికి అంచనా వేసిన జనాభా మేరకు, ₹4170 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. మామునూరు విమానాశ్రయం నిర్మాణం వరంగల్ ప్రజల దీర్ఘకాలక లక్ష్యం. ఇందుకోసం అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ₹205 కోట్లు గ్రీన్‌చానెల్ ద్వారా విడుదల చేసింది.కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు సంబంధించి, ఆర్&ఆర్ ప్యాకేజీ కింద 1398 లబ్ధిదారులను గుర్తించి, వారికోసం రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో 863 ప్లాట్లను కేటాయించారు.సెప్టెంబర్ నాటికి టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో వెటర్నరీ ఆసుపత్రి, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణం ఉన్నాయి.టెక్స్‌టైల్ పార్క్‌లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.భద్రకాళి దేవస్థాన అభివృద్ధి కింద మాడ వీధులు, కళ్యాణ మండపం, పూజారి నివాస భవనాలు, విద్యుత్ అలంకరణ పనులు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియం కోసం అవసరమైన స్థలాన్ని గుర్తించారు. 

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ ప్రోత్సాహం

అసంపూ ర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పూర్తి చేసుకునేందుకు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ ప్రక్రియను వచ్చే నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఇండ్లకు సంబంధించిన అభ్యర్థనలు, దరఖాస్తులను పరిశీలించి, ఇసుక, బిల్లుల చెల్లింపులు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శ్రావణ మాసం సందర్భంగా త్వరలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి.ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు పరిష్కరించేందుకు హైదరాబాదు హౌసింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

WhatsApp Image 2025-07-26 at 9.43.22 PMప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు పని చేయాలి

ప్రభుత్వ ప్రణాళికలు ప్రజల వరకు చేరాలంటే, అధికారులు ప్రతిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందని సమీక్షలో స్పష్టం చేశారు. రేషన్ కార్డుల పంపిణీ, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను శాసన సభ్యుల భాగస్వామ్యంతో ప్రతి మండలంలో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న