రజకుల అభివృద్ధికై మేధావులు కృషి చేయాలి
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:
రజకుల సాంఘిక, రాజకీయ అభివృద్ధికై సమాజంలో ఉన్న మేధావులైన రజకులు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా రజక అభివృద్ధి సంఘం సభ్యులు చిట్యాల బిక్షపతి కోరాడు. ఆదివారం హాసన్ పర్తి ఆదర్శ రజక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పదవి విరమణ చేసిన రజక సభ్యులకు, భద్రకాళి దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులుగా ఎన్నికైన రజక సోదరులకు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రజకులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని అందుకు మేధావులైన రజకులు వారికి తోడ్పాటు అందించాలని కోరాడు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 30 ఏళ్ల పాటు విధులు నిర్వహించి సమాజానికి సేవ చేసిన రజకులు పదవి విరమణ పొందిన తర్వాత రజకుల అభివృద్ధికై వారి సమయాన్ని కేటాయించాలని ఆయన సూచించాడు. రజకులు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయంగా పోటీలో ఉండాలని వారికి గ్రామంలో ఉన్న రజకులు ఒక తాటిపైకి వచ్చి తోడ్పాటు అందించాలని కోరాడు. ఆదర్శ రజక సహకార సంఘం హసన్ పర్తి సంఘం అధ్యక్షుడు గోపరాజు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉన్న రజకులు ఐకమత్యంతో పార్టీలకతీతంగా పనిచేసే రజకులను ప్రోత్సహించాలని సూచించాడు. రాజకీయ పార్టీలు సైతం జనాభా ప్రాతిపదికన రజకులకు సరైన అవకాశాలను కల్పించాలని ఉదయ్ సూచించాడు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ పొందిన ఎలుక రాజు సాంబయ్య, గోపరాజు కుమారస్వామి, గోపరాజు సారయ్య, గోపరాజు సుధాకర్ లతోపాటు భద్రకాళి దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులైన పాలడుగుల ఆంజనేయులు, ఓరుగంటి పూర్ణచందర్ లను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ రజక సహకార సంఘం సభ్యులైన గుడికందుల కుమారస్వామి. ఎలుక రాజు కుమారస్వామి, తంగళ్ళపల్లి సారయ్య, గోపరాజు కనక స్వామి, ఎలుక రాజు సదానందం, తంగళ్ళపల్లి సాంబమూర్తి, గుడికందుల సురేష్, గోపరాజు యాదగిరి , గుడికందుల కనుక స్వామి(బ్యాంక్) తదితరులు పాల్గొన్నారు.
Comments