పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ కిట్ల పంపిణీ
మల్కాజిగిరి, తెలంగాణ ముచ్చట్లు:
మల్కాజిగిరి నియోజకవర్గంలోని 138వ మౌలాలి డివిజన్ పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ కిట్లను కార్పొరేటర్ గున్నాల సునీత యాదవ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పారిశుధ్య కార్మికులు సేవా భావంతో పనిచేస్తూ సమాజ ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్షాకాలంలో కూడా వారు రోడ్లపై నిలిచిన నీరు తొలగించుట, కాలువల్లోని చెత్త తొలగించుట వంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు,” అని పేర్కొన్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలకు సమాజం రుణపడి ఉందని అభిప్రాయపడి, ప్రజలు కూడా తమ వంతుగా సహకరించాలన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ఇంటి చెత్తను ‘స్వచ్చ్ ఆటో టిప్పర్’కు మాత్రమే ఇవ్వాలని, కాలువల్లోకి చెత్త వేయకుండా జాగ్రత్త పాటించాలని సూచించారు.
వర్షాకాలంలో విధులకు వెళ్తే కార్మికులు ఆరోగ్య పరిరక్షణ కిట్లలోని రెయిన్ కోట్, గ్లౌజులు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. డివిజన్‌లోని ప్రతీ పరిశుద్ధ కార్మికుడికి కిట్లు అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ అజయ్, యాదగిరి, కిష్టమ్మ, భారతి, అంజమ్మ, మనీషా, ఊర్మిళ, భాస్కర్ రావు, సంగీత తదితర ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు. కార్మికులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కోరుతూ, డివిజన్‌ను పారిశుధ్యంలో ఆదర్శంగా తీర్చిదిద్దేలా పనిచేయాలని కార్పొరేటర్ ఆకాంక్షించారు.
Comments