మహిళా సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తున్న బీఆర్‌ఎస్
మాజీ డిప్యూటీ సిఎం తాటికొండ రాజయ్య
పరకాల, తెలంగాణ ముచ్చట్లు:
పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాలలో కేసీఆర్ కిట్లు, కుట్టుమిషన్లను మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ...“గడచిన దశాబ్ద కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల సాధికారతకు కృషి చేసింది. కేసీఆర్ కిట్లు, కుట్టుమిషన్లు వంటి కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతున్నాయి. పరకాలలో ఈ కార్యక్రమం జరగడం అభినందనీయం. రాబోయే రోజుల్లో కేటీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అనివార్యం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన రాజయ్య
అంతకుముందు కరుణాపురం నేషనల్ హైవే వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య స్వయంగా పూల బొకే అందించి స్వాగతం పలికారు.పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు హాజరై సిఎం సిఎం అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
Comments