మౌలిక వసతుల కోసం ఎమ్మెల్యేకు కాలనీవాసుల వినతి
Views: 16
On
మల్కాజిగిరి, తెలంగాణ ముచ్చట్లు:
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఎన్ఎండీసీ కాలనీ వీధి సంఖ్య 3లో మౌలిక సదుపాయాల కొరతపై స్థానికులు శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన వారు, కాలనీలో సీసీ రోడ్లు వేయాలని, త్రాగునీటిలో ఒత్తిడి సమస్యను పరిష్కరించాలని, పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేయాలని, ఫాగింగ్ నిర్వహణ చేపట్టాలని కోరారు.
వినతిపై స్పందించిన శాసనసభ్యుడు సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందజేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గౌడ్, సాయికృష్ణ పరాశర్, శరత్ కుమార్, వరలక్ష్మి, ఎంఎస్ నారాయణ, శ్రీనివాస్, వెంకట చారి, మోహన్ రావు, తేజ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments