లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెర్మనీ
కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్ నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెర్మనీ కార్యక్రమానికి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నియామక పత్రాలు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బోధన విధానాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక బాధ్యతలు, నాయకత్వ లక్షణాలను నేర్చుకోవడం అవసరమన్నారు. ఇలా అభివృద్ధి చెందిన పిల్లలే భవిష్యత్తులో క్రమశిక్షణతో కూడిన ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జోసెఫ్ పసల, లుకాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments