కరాటే పోటీల్లో సత్తా చాటిన నారాయణ విద్యార్థి.
- ఆల్ ఇండియా ఛాంపియన్‌షిప్–2026లో మట్టా స్వామి గౌడ్ ప్రతిభ.
- అభినందించిన పాఠశాల యాజమాన్యం.
సత్తుపల్లి, నవంబరు 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్–2026లో నారాయణ స్కూల్ సత్తుపల్లికి చెందిన విద్యార్థి మట్టా స్వామి గౌడ్ ప్రతిభ చాటాడు. కరాటే పోటీల్లో రాణించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఏజీఎం రాంకీ, ఆర్‌ఐ క్రాంతి స్వామి గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల పట్ల ఆసక్తి, సాధనలో పట్టుదల, కృషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ రామ్మూర్తి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. విద్యార్థి విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం కీలకమని పేర్కొంటూ స్వామి గౌడ్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, చదువుతో పాటు క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించడమే పాఠశాల లక్ష్యమని తెలిపింది. స్వామి గౌడ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించింది.


Comments