ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలనకు ప్రథమ ధ్యేయం
నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు)
మల్లాపూర్ డివిజన్ స్వామి వివేకానంద నగర్ కాలనీ ఫేజ్–3లో “బస్తీ బాట” కార్యక్రమం భాగంగా పర్యటించిన గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, కాలనీ ప్రజలతోసమావేశమై సమస్యలను తెలుసుకున్నారు.కాలనీలో తాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాల వంటి అంశాలను కాలనీ వాసులు వివరించగా, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారానే ప్రజలకు నిజమైన ప్రజాపాలన అందుతుందని అన్నారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతోపెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని నెమలి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సానాల రవికుమార్, ప్రధాన కార్యదర్శి పైళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పల్లె శివగౌడ్, సంయుక్త కార్యదర్శులు పైళ్ల గౌతమ్, అరుణ్‌కుమార్, సభ్యులు రాములు గౌడ్, దయాకర్, నవీన్, సైదులు తదితరులు పాల్గొన్నారు.


Comments