మాఇల్లు ఆశ్రమంలో జనసేనాని జన్మదిన వేడుకలు.

ఆశ్రమ పిల్లలతో కేక్ కట్ చేసిన జనసేన ఇంచార్జ్ గాదె పృథ్వి.

మాఇల్లు ఆశ్రమంలో జనసేనాని జన్మదిన వేడుకలు.

జఫర్గడ్: జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. మండలంలోని మాఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో జనసైనికులు ఏర్పాటు చేసిన అన్నదానం, ఆశ్రమ పిల్లలతో సహాపంక్తి భోజన కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వేడుకలు ఆశ్రమ పిల్లలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మహమ్మద్ రజాక్, మినుముల సంజయ్, భూక్యా హుస్సేన్, కొలిపాక వంశీకృష్ణ,సయ్యద్ కాశీం,మునిగాల పవన్,గ్యార బన్నీ, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు
హాసన్ పర్తి, డిసెంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు) రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా హసన్ పర్తి మండలంలోని గ్రామపంచాయితీలలో కొత్తపల్లి సర్పంచిగా దండ్రి సాంబయ్య,అర్వపళ్లి సర్పంచ్ గా...
ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు... 
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధికి చర్యలు.... 
ప్రశాంతంగా ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా.
చిల్కానగర్ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ బన్నాల
జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి