మిస్ ఇండియా -2024' గా నిఖిత పోర్వాల్

మిస్ ఇండియా -2024' గా నిఖిత పోర్వాల్

 డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:
ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా  (Femina Miss India 2024) కిరీటాన్ని నిఖిత పోర్వాల్ (Nikita Porwal) సొంతం చేసుకున్నారు. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగిన ఈవెంట్లో మధ్యప్రదేశ్ కు  చెందిన నిఖిత విజయం సాధించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్నరప్ గా  నిలిచారు.60వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. కేవలం తమ అందాలతోనే కాదప్రతిభతోనూ జడ్జిల నుంచిప్రశంసలు అందుకున్నారు.తుది పోరులో అదరగొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఉజ్జయినికి చెందిన నిఖిత తనఆనందాన్ని వ్యక్తంచేశారు. "ఇప్పుడు నేను అనుభవిస్తోన్న ఆనందాన్ని వర్ణించలేను. ఇదంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. కానీ నా తల్లిదండ్రుల కళ్లలోని ఆనందం చూసి గర్వంగా ఉంది. నా ప్రయాణంఇప్పుడే మొదలైంది. ఇంకా నేను సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయి” అని ఆమె సంతోషం
వ్యక్తంచేశారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన నందినిగుప్తా విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఇక,రన్నరప్ లు రేఖ స్వస్థలం దాద్రా అండ్ నగర్ హవేలీ కాగా.. ఆయుశీది గుజరాత్.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News