నేర నిందితులను పట్టుకొవడంలో పోలీస్‌ జాగిలం కీలకం

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేర నిందితులను పట్టుకొవడంలో పోలీస్‌ జాగిలం కీలకం

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు  నూతనంగా వచ్చిన పోలీస్‌ జాగిలాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం పరిశీలించారు. గత 28వ తేదిన మొయినాబాద్‌లోని పోలీస్‌ జాగిలాల శిక్షణా కేంద్రంలో ఎనిమిది నెలల శిక్షణను పూర్తి చేసుకోని వచ్చిన ఐదు పోలీస్‌ జాగిలాలు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ డాగ్‌ స్వ్కాడ్‌లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్దమయినాయి. ప్రేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్‌ మాలినోస్‌, రెండు గొల్డెన్‌ రీట్రీవర్‌ జాతులకు చెందిన జాగిలాలు, వీటికి  రానా, జానీ, డయానా, మాక్స్‌, కైరో గా నామకరణం చేయడం జరిగింది. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలను సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు హ్యాండ్లర్లు వివరించారు. గతంలోని జాగిలాలు ఎన్నో ప్రేలుడు పదార్థాలను పసిగట్టడంలో విజయం సాధించాయని ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ గుర్తు చేసారు. నూతనంగా వచ్చిన జాగిలాలకు మెరుగైన వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా సిపి సంబంధిత అధికారులను ఆదేశించారు.WhatsApp Image 2025-03-04 at 6.06.09 PM
ఈ కార్యక్రమములో అదనపు డిసిపి సురేష్‌కుమార్‌, ఆర్‌.ఐ శ్రీనివాస్‌, డాగ్‌ స్వ్కాడ్‌ ఇంచార్జ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ప్రభాకర్‌తో పాటు హ్యాండ్లర్లు రాజేష్‌ కుమార్‌, వెంకన్య, సురేష్‌, దిలిప్‌లు పాల్గోన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...
ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.