ప్రమాదకరంగా ఎల్కతుర్తి చౌరస్తా రహదారి
ఎల్కతుర్తి, నవంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి చౌరస్తా రహదారి ప్రమాదకరంగా మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ట్రాఫిక్ సూచిక బోర్డులు లేకపోవడం, ద్విచక్ర మరియు భారీ వాహనాలు రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, అపూర్ణంగా వదిలేసిన డ్రైనేజీ పనులు, రోడ్డుపై గుంతలు వంటి అనేక సమస్యలు స్థానికులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి.
నో పార్కింగ్ బోర్డులు లేకపోవడంతో లారీలు, ట్రక్కులు రహదారిపైనే నిర్లక్ష్యంగా నిలపడం వల్ల ట్రాఫిక్‌కు పెద్ద ఆటంకం ఏర్పడుతోంది. ఈ కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొన్నారు. భారీ వాహనాలు రాంగ్ రూట్‌లోకి రావడం చౌరస్తాలో ప్రమాదాల తీవ్రతను పెంచుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చౌరస్తా వద్ద డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో మురుగు నీరు రోడ్డుపైనే చేరి దుర్వాసనతో పాటు పరిసరాల్లో అస్వచ్ఛత పెరుగుతోంది. రహదారి చుట్టూ గుంతలు పెరగడంతో వాహనదారులు ప్రమాదాలను తప్పించుకోవడం కష్టంగా మారింది. రోడ్డు తవ్వి వదిలేయడం, తవ్విన చోట పిచ్చిమొక్కలు పెరగడం కూడా రాత్రివేళల ప్రమాదాలకు దారితీస్తోంది.
చౌరస్తాకు దూరంగా ఉన్న రోడ్లు సగం మాత్రమే వేసి వదిలేయడంతో భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము అధికంగా లేస్తోంది. దుమ్ము పక్క ఇళ్లలోకి చేరి ఆహారపదార్థాలపై పడుతుండగా, సమీపంలోని పాఠశాలకు కూడా దుమ్ము చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.
రోడ్డుపక్కన నరికిన చెట్లు తొలగించకపోవడం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తోందని నివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రివేళలు అవి స్పష్టంగా కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నో పార్కింగ్, రాంగ్ రూట్ సూచించే బోర్డుల ఏర్పాటు, ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం, డ్రైనేజీ పనుల పూర్తి, గుంతల పూడిక, రోడ్డుపక్కనున్న నరికిన చెట్లతొలగింపు, దుమ్ము తగ్గించే చర్యలను తక్షణమే చేపట్టాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. 

తొలగింపు, దుమ్ము తగ్గించే చర్యలను తక్షణమే చేపట్టాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.


Comments