రైతే రాజట

రైతే రాజట

రైతే రాజట"

నీ నోటిన దేశం 
అప్పుల మట్టి కొట్టిన

ఆ మట్టి పొరనుండి మెతుకుగా మారి 
దేశ తనువుకు ప్రాణ భిక్షమెట్టిన త్యాగం నీది. 

నీ శ్రమ కిలో "రూపాయేనని"
అంగళ్లలో గుండెలపై గుద్ది పంపినా

మళ్ళీ మన్నును
ముద్దాడి దున్ని

ఎద విరుచుకుని 
"అన్నదాతగా" 
జాతిని నిలిపిన ధైర్యం నీది

నువ్వే రాజనే మాటల కోటపై మరో యుగమన్నా నిను కూర్చుండబెట్టి

పట్టాభిషేకాన్ని పొడిగించేసే 
పన్నాగమేసిన ప్రజాస్వామ్యమిది

ఆత్మ గౌరవమనే 
నీ పిడికిడి పొట్టకు
పలు తరాలుగా
పస్తులు పెట్టి 

దళారీ నక్కల 
"దోపిడీ పంటలు"
ఏపుగా పండే 
రైతు సుభిక్ష రాజ్యమిది.


✍️రచయిత :

నేపా.సంతోష్ అచ్యుత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాళోజి ప్రతిభ పురస్కార గ్రహీత,విజయవాడ,
8639442397.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?