ఘనంగా 32వ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం
బాలనగర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)
బాలానగర్, చరబండ రాజు కాలనీ శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయంలో 32వ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం బుధవారం ఎంతో వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు సమాజంలో ఐక్యత, సాంప్రదాయం, భక్తి విలువలను చాటిచెప్పే వేడుకలని పేర్కొన్నారు. విశ్వకర్మను సృష్టికర్తగా, శిల్పకళలకు అధిపతిగా ఆరాధించే సంప్రదాయం ఎంతో ప్రాచీనమైందని, అలాంటి ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లిరాజేశ్వరరావు, శేఖర్ యాదవ్, స్థానిక నాయకులు, బీజేపీ కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు భక్తజనాలతో కిటకిటలాడాయి.మహోత్సవంలో హోమాలు, వేదపఠనాలు, అన్నదానాలు నిర్వహించగా భక్తులు విశేషంగా స్పందించారు.
Comments