ఘనంగా ఎంపీజే జిల్లా కార్యవర్గ సమావేశం
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 15, తెలంగాణ ముచ్చట్లు;
మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) జిల్లా కార్యవర్గ సమావేశం సోమ వారం, ఎంపిజే జిల్లా ప్రధాన కార్యాలయం లో ఘనంగా జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్ అధ్యక్షత వహించగా, భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనపై సభ్యులు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అనంతరం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు, ఎంపీజే జిల్లా కోశాధికారి ఎం.డి. హకీమ్ ఇటీవల రిటైర్మెంట్ పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన సేవలను ప్రశంసిస్తూ, కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్ తో పాటు, కోశాధికారి ఎం.డి. హకీమ్, కార్యదర్శులు రజబాలి, బొగ్గవరపు సతీష్, రఫీక్, జి. శ్రీనివాస్ (ఆర్.ఓ), బుర్ర వెంకటేశ్వర్లు, మాజీకార్పొరేటర్లు కనకం భద్రయ్య, దడాల రఘు, మీడియా కన్వీనర్ టి.ఎస్. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments