అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
కొత్తకోట,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తమ గ్రామ శివారులోని సర్వే నంబర్లు 370, 371లో ఉన్న ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని బుధవారం తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్లలో ఇప్పటికే శ్రీకృష్ణ దేవాలయం, మదర్ థెరిస్సా కమిటీ హాల్, 10 మంది జర్నలిస్టులకు, ఉద్యమకారుడు మహేష్‌కు, వాల్మీకి దేవాలయానికి స్థలాలు కేటాయించారని. మిగిలిన భూమిలో అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
అలాగే మా గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని గ్రామ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలనీ, ఆ గ్రామానికి సంబంధం లేని వారికి స్థలాలను కేటాయించకూడదని డిమాండ్ చేశారు. “భవిష్యత్తులో గ్రామానికి అవసరమైన స్థలం లేకుండా పోకుండా ప్రస్తుత ప్రభుత్వ భూమిని భద్రపరచాలి” అని గ్రామస్థులు తహసీల్దార్‌కు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాగన్న, ప్రభుదాస్, పెద్ద కుర్మయ్య, బోజ్జన్న, ధనుష్, డీకే లక్ష్మణ్, జంగిడి రాజు, దామోదర్, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments