ఖమ్మంలో 'ఇన్నోవేట్ ది ఇన్నర్ సెల్ఫ్' ఆధ్యాత్మిక సభాకార్యక్రమం
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 14, తెలంగాణ ముచ్చట్లు:
“మానవతా రక్షతి రక్షితా:” నినాదంతో, మానవతా సమాజ స్థాపనే లక్ష్యంగా ఆధ్యాత్మిక విశ్వ గురువు శ్రీ గురు విశ్వస్ఫూర్తి ఆశీస్సులతో, వారి భక్తులు “స్ఫూర్తి కుటుంబం - తెలంగాణ” ట్రస్ట్ ఏర్పాటు చేసి, పలు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఖమ్మం పట్టణంలోని శ్రీ నగర్ కాలనీలోని ఎస్. ఆర్. కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో, ' ఇన్నోవేట్ ది ఇన్నర్ సెల్ఫ్' పేరుతో సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాస్ హాజరయ్యారు. సభనుద్దేషించి వారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులనీ, మానవతా విలువలు, మంచి అలవాట్లు బాల్యంలోనే చొప్పించాలని తెలియజేసారు. స్ఫూర్తి కుటుంబం-ట్రస్ట్ ద్వారా మానవత్వాన్ని ప్రచారించడం హర్షించదగ్గర విషయమని కొనియాడారు.
శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు సుమారు నాలుగు పదుల గ్రంథాలు రచించారు. మనిషి, మానవ సమాజానికి సంబంధించి అన్ని విషయాలు, అలాగే ఆధ్యాత్మిక సంబందిత విషయాలు, సాధన విధానాలు ఎన్నో పొందుపరచారు. వారందించిన ఆ జ్ఞానభండాగారాన్ని, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సభా కార్యక్రమాల ద్వారా మానవజాతికి అందిస్తున్నారని తంబూరి దయాకర్ రెడ్డి తెలియజేసారు.
మనిషి, మనసు, జీవితం, కుటుంబం, సమాజం, నేటి బాలల పట్ల కుటుంబ సమాజ బాధ్యత, ప్రాక్టికల్ ఫిలాసఫీ, రిలీజియస్ హ్యుమానిటీ అనే అంశాలపై సభికులు ఉపన్యసించారు.మానవత్వం ఆచరణలో తీసుకురావాలని, ప్రతి మనిషి సాటి మనిషిని, మనిషిగ గుర్తుంచి, గౌరవించడం మానవత్వం అని, దాన్ని ఆచరణలో నిరూపించు కోవాలని, మానవత్వ సమాజ స్థాపన అనే మహా యజ్ఞం కొరకు అందరూ భాగస్వామ్యం కావాలని ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆళ్ళ రాజేష్ గారు పిలుపునిచ్చారు. మనిషిలో పశుత్వం, క్రూరత్వంతో పెరిగి, మానవజాతి మనుగడకే ప్రమాదం పొంచి వున్న నేటి సమాజంలో, మనిషిలో మానవత్వం పెంపొందించాలనీ, సమాజంలో ఆత్మీయత స్థాపన జరగాలనేది శ్రీ గురు విశ్వస్ఫూర్తి ఆశయమని, డిప్యూటీ సివిల్ సర్జన్ డా. రామారావు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు కె. రాధాకృష్ణ, వి. విక్రమ్, ఎన్. సురేష్, జె. రవింద్రబాబు, రిటైర్డ్ స్కిన్ స్పెషలిస్ట్ డా. విమల, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ గోపాల్, జె. వెంకటేశ్వరరావు, జోనల్ ఇంచార్జి శ్రీ ఎన్. రవికుమార్ తదితరులు విచ్చేసి సభలో పాల్గొన్నారు.
Comments