అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

రూ.1 కోటి తో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం

అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ డివిజన్‌లో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. స్థానిక కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తరచూ పనులను పర్యవేక్షిస్తూ ఉంటున్నారు.సోమవారం ఆయన ఉప్పల్ హిల్స్ కాలనీలో పర్యటించి, 93 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 7 లక్షల రూపాయలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఏఈ రాజ్‌కుమార్‌ తో కలిసి కాలనీ వాసుల సమక్షంలో పరిశీలించారు.అదనంగా, ఉప్పల్ హిల్స్ 40 ఫీట్ల రోడ్‌ నుండి హనుమాన్ దేవాలయం వరకు 65 లక్షల రూపాయల తో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కార్పొరేటర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ రాజ్‌కుమార్, దుర్గం నవీన్ యాదవ్, గోవింద్ కుమార్ స్వామి, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, పి.రామచందర్, ఎం.సుధాకర్ రెడ్డి, టి.విజయ్ సింగ్, ఈ.మహేందర్, టి.శ్రీనివాస్ రెడ్డి, ఏ.రవి, జి.కొమురయ్య, వెంకటేష్ గౌడ్, ఏ.బిక్షపతి, ఏ.రాజు, ఎండి.హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?