హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన

హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన

నాచారం, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)

దేశభక్తి, జాతీయ సమైక్యత భావాల పెంపొందనకు ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో ప్రాముఖ్యమైందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.నాచారం డివిజన్ పరిధిలోని హెచ్‌.యం.టి. నగర్ హెచ్‌.యం.డి.ఏ పార్క్‌లో హెచ్‌.యం.టి. నగర్ ఫ్రెండ్స్ టీమ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం 7.45 గంటలకు జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. జాతీయ గీతాలాపన ఒక క్రమశిక్షణ, దేశభక్తి, ఐక్యతకు ప్రతీక అని, చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ: స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం మనకు లభించిందంటే అది త్యాగాల ఫలితమని, ప్రతిరోజూ జాతీయ గీతాన్ని పాడడం ద్వారా ఆ త్యాగాలను గుర్తుచేసుకోవడం సమాజంలో అవగాహన పెంచుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్, గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎం.బి.సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడురి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, హెచ్‌.యం.టి. నగర్ వాసులు భారీగా హాజరయ్యారు.పిల్లలు, యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఈ పార్క్ దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ కొనసాగించేందుకు సంకల్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?