స్వచ్ఛతా హీ సేవా  ప్రజా పాలన దినోత్సవం ప్రత్యేక కార్యక్రమాలు

స్వచ్ఛతా హీ సేవా  ప్రజా పాలన దినోత్సవం ప్రత్యేక కార్యక్రమాలు

నాగారం, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మరియు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంను పురస్కరించుకొని, నాగారం పురపాలక సంఘంలో వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకలకు పురపాలక సంఘం కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యం నిర్వహించారు.
మొదట కమిషనర్ జెండా ఆవిష్కరణ చేసి, అనంతరం పురపాలక సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, యువతతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.అలాగే రోడ్లు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. చెత్త తొలగింపు, శుభ్రత చర్యలు విస్తృతంగా జరిగాయి. పట్టణం మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మారేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ సంతోష్ కుమార్, మేనేజర్ సురేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ నాగేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ బి. శ్రవణ్ కుమార్ తో పాటు పురపాలక సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కమిషనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ : “పరిశుభ్రత మన బాధ్యత మాత్రమే కాదు, మన సంస్కృతిలో కూడా ఒక భాగం. ప్రతి పౌరుడు పరిశుభ్రతకు కట్టుబడి ఉంటేనే ఆరోగ్యం, అభివృద్ధి సాధ్యమవుతుంది. నాగారం పట్టణం పరిశుభ్రమైన మున్సిపాలిటీగా నిలవడం అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది” అని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?