చండీశ్వర్ నగర్ కాలనీలో కొత్త కమాన్ ప్రారంభం
మాజీ చైర్మన్ చంద్రారెడ్డి
నాగారం, సెప్టెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని చండీశ్వర్ నగర్ కాలనీలో కొత్తగా నిర్మించిన కమాన్‌ను ఘనం గా ప్రారంభించారు. ఈ కమాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగారం మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో మెరుగు శ్రీనివాస్ రెడ్డి, అలాగే కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.అతిథులు మాట్లాడుతూ – కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు సంతోషకరమని, భవిష్యత్తులో కూడా మౌలిక వసతుల కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.కాలనీ నివాసులు కమాన్ నిర్మాణంతో తమ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు.


Comments