తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

కాప్రా, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కాప్రా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తహసీల్దార్ సుచరిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, అనంతరం జరిగిన సభలో విఠల్ నాయక్ మాట్లాడుతూ "ప్రజాపాలన దినోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మహత్తర ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. నిజాం రాజ్యంలోని నిరంకుశ పాలన, రజాకారుల అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో ఫలితంగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను పొందారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రోజు," అని అన్నారు.అలాగే ఆయన రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, " మనమంతా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలి. రైతులు, కూలీలు, సాధారణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పనిచేయాలని" కోరారు.
ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?