హైకోర్టు కాలనీ హెచ్ఎంటి నగర్ లింకు రోడ్డు పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే బండారి
17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం ప్రారంభం
చిల్కానగర్, నాచారం, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు కాలనీ నుండి హెచ్ఎంటి నగర్ వరకు కలిపే నూతన లింకు రోడ్డుకు శంకుస్థాపన ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డును రూ. 17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు సౌకర్యం కలుగుతుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ –
“కాలనీల మధ్య లింకు రోడ్లు నిర్మించబడితే ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయి. హైకోర్టు కాలనీ నుండి హెచ్ఎంటి నగర్ వరకు పాడైపోయిన రోడ్డును అత్యంత త్వరగా పూర్తిచేసి, స్థానికుల వినియోగానికి అందుబాటులోకి తెస్తాం. అభివృద్ధి పనులలో ఎక్కడా రాజీపడమని ప్రజలకు హామీ ఇస్తున్నాం” అని అన్నారు.ప్రజల్లో హర్షం:ఈ కార్యక్రమం లో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేఖర్ పాల్గొన్నారు.అలాగే బీఆర్ఎస్ పార్టీ చిల్కానగర్, నాచారం డివిజన్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభమైనందుకు హర్షం వ్యక్తం చేశారు.
Comments