ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
హనుమకొండ,సెప్టెంబర్14(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ ఆర్.డి. కోఆపరేటివ్ జూనియర్ కళాశాల 1999–2001 (సీఈసీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు కాలేజీ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందభరిత క్షణాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, “ఆ కాలం మాకు కేవలం విద్య నేర్పిన రోజులు మాత్రమే కాదు, గురువుల పట్ల గౌరవం, విలువల పాఠాలు అందించిన బంగారు కాలం” అని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఉపన్యాసకులు పూర్వ విద్యార్థుల విజయాలను ప్రశంసిస్తూ, సమాజంలో వారు సాధించిన స్థానం గర్వకారణమని పేర్కొన్నారు. గురువులకు విద్యార్థులు ఘన సత్కారం అందించారు.
సమ్మేళనంలో మిత్రులలో ఎవరికైనా ఆపద వచ్చినా పరస్పరం ఆదుకోవాలని, సమాజానికి మరింత సేవ చేయాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. ప్రస్తుత విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి తమ వంతు సహకారం అందిస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రామ్మూర్తి, ఉపన్యాసకులు మహేష్, కృష్ణ మీనన్, సుధాకర్, రవీందర్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments