అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ కు వినతి
కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్
గౌతమ్ నగర్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ వార్డుల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు సమగ్రంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, కొన్నిపనులు నిధుల కొరత వల్ల నిలిచిపోయాయని డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో డివిజన్‌లోని అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాల ని కోరుతూ, జోనల్ కమిషనర్ రవికిరణ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించిన రహదారులు, కాలువలు, పార్కుల అభివృద్ధి, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలు వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేటర్ కోరారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.వినతిని పరిశీలించిన జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తి అయితే స్థానిక ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందుతాయని, డివిజన్ రూపురేఖలు మరింత మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల రామ్ యాదవ్, విజయ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని వేగవంతం చేయాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు.
Comments