సిపిఎం సానుభూతి పరురాలు మృతి...
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 15, తెలంగాణ ముచ్చట్లు;
చింతకాని మండల పరిధిలోని కోదుమూరు గ్రామానికి చెందిన దంతాల సీతమ్మ 55 సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు ఆమె మృతదేహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ పార్టీ జెండా కప్పి పూలమాలవేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ సీతమ్మ బ్రతికినంత కాలం పార్టీతో ఉన్నారని ఏ కార్యక్రమాలు జరిగినా ముందుండి పాల్గొనేవారు వారి కుటుంబం ఇప్పటివరకు పార్టీని అంటి పెట్టుకున్నారని ఆమె అకాల మరణం పార్టీకి ఎంతో తీరని లోటుగా భావిస్తున్నామన్నారు వారి కుటుంబానికి సిపిఎం పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంటుందని వారి కుటుంబానికి తెలిపారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రాచబంటి రాము శాఖ సెక్రెటరీ నక్కన బోయిన శాంతారావు సీనియర్ నాయకులు తిగుళ్ల నాగులు మాదినేని రవి బందెల కళ్యాణ్ చిట్టి మోదు చిన్న లింగయ్య భయ్యా బాలాజీ శ్రీను పార్టీ సభ్యులు పాల్గొన్నారు
Comments