రాచకొండ కమిషనరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం
అంబర్‌పేట, సెప్టెంబర్ 17(తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అంబర్‌పేట కార్ హెడ్‌క్వార్టర్స్‌లో సిపి సుధీర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవ నసాగిందని, అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలో విజయవంతమవడంతో 1948సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తు చేశారు. అందుకే ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.
ప్రజా పాలనలో పారదర్శకత ఉండడం ద్వారా ప్రజలకు లాభాలు చేకూరుతాయని, శాంతి భద్రత పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజా ఐపీఎస్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ ఎస్ఓటి రమణ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీలు మనోహర్, శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ శ్యామ్ సుందర్, అదనపు డీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.
Comments