స్వచ్ఛత హి సేవ 2025 విజయవంతం చేయాలి
కలెక్టర్ స్నేహ శబరిష్
Views: 7
On
హన్మకొండ:
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ స్వచ్ఛత హి సేవ–2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న స్వచ్ఛత సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ స్థాయిలో శానిటేషన్‌తో పాటు స్వచ్ఛతకు సంబంధించిన విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని స్వచ్ఛతను అలవాటు చేసుకోవడంతో పాటు పరిశుభ్ర వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీను, డిపిఓ రమాకాంత్, స్వచ్ఛ భారత్ జిల్లా ప్రతినిధి సంపత్ కుమార్, ప్రవీణ్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Sep 2025 21:17:00
ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
Comments