ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బోయినపల్లిలో వీల్‌చైర్స్ పంపిణీ

కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బోయినపల్లిలో వీల్‌చైర్స్ పంపిణీ

బోయినపల్లి, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని, బోయినపల్లిలో వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ. మెంటల్‌గా డిసేబుల్ పిల్లలకు ఇంకా మెరుగైన సదుపాయాలు అవసరమని అన్నారు.ఈ సమస్యలపై మరిన్ని రీసెర్చ్ జరగాలని సూచించారు.ఈ కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఎర్లీ డిటెక్షన్ ద్వారా చాలా సమస్యలు పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.అలాగే దివ్యాంగుల గౌరవప్రదమైన జీవితానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. “జీనోం యుగంలో శాశ్వత పరిష్కారాలు కనుగొని, మెంటల్ డిజేబిలిటీ రాకుండా చూసుకోవాలి” అని అన్నారు.మోదీపై ప్రశంసలు ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “మోదీ  12వ సంవత్సరంలో ప్రధానమంత్రిగా అడుగుపెట్టారు.WhatsApp Image 2025-09-17 at 6.23.06 PM75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల యువకుడిలా ఆలోచిస్తూ, 365 రోజులు నిరంతరం పని చేస్తున్నారు. ఆయనకు జ్వరం వచ్చినా, మోకాళ్ల నొప్పులు వచ్చినా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోరు” అని కొనియాడారు.మోదీ పాలనలో మార్పులు జన్‌ధన్ ఖాతాల ద్వారా పేదలకు ఆర్థిక సహకారం అందిందని, చిన్న వ్యాపారులు, పళ్ళు అమ్మే వారు కూడా డిజిటల్ పేమెంట్ వినియోగిస్తున్నారని తెలిపారు. “ఇంతవరకు బిచ్చగాళ్లు కూడా స్కానర్ కోడ్ పెట్టుకోవడం మోదీ పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పు” అని అన్నారు.కార్యక్రమం ప్రాముఖ్యత ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. “ఇలాంటివి మరింత మంది ముందుకు వచ్చి చేయాలి. సేవ చేసేవారు పెరిగితే సమాజం బాగుపడుతుంది” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేజర్ రాజ్‌కుమార్, డిజిఎం సంజయ్ సింగ్, కొల్లి నాగేశ్వరరావు, నర్మదా మల్లికార్జున, దీపికా, శేఖర్ యాదవ్, మాణిక్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పిట్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?