పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు
పెద్దమందడి,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల బిజెపి కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండలాధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు.తదనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముప్పూరి చెన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోడీ పుట్టినరోజు పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “మోడీ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య, శివారెడ్డి, తిరుపతయ్యతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
Comments