మౌలాలి చౌరస్తా వద్ద ఈద్-ఎ-మిలాద్ ఉన్ నబి సందర్భంగా శోభయాత్ర, షర్బత్  పంపిణీ 

మౌలాలి చౌరస్తా వద్ద ఈద్-ఎ-మిలాద్ ఉన్ నబి సందర్భంగా శోభయాత్ర, షర్బత్  పంపిణీ 

మౌలాలి, సెప్టెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి నియోజకవర్గం 138 మౌలాలి డివిజన్ లో ఎం.జె. కాలనీ పరిధిలోని మజీద్-ఎ-మహమ్మదీయ బేగం ఆధ్వర్యంలో ఈద్-ఎ-మిలాద్ ఉన్ నబి సందర్భంగా శోభాయాత్ర  ఆదివారం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మౌలాలి చౌరస్తా వద్ద ప్రతి సంవత్సరం మాదిరిగానే భక్తులు, ప్రజలకు ఉచితంగా షర్బత్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
గత 12 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం స్థానికుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా మారిందిWhatsApp Image 2025-09-14 at 6.51.38 PMచిన్నారులు, యువత, వృద్ధులు అందరూ సమానంగా పాల్గొని జులూస్ కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా 138వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షకీల్ హాజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులుగా నజీర్ ఖాన్, అబ్బాస్, ఐజాజ్ సామీ, షాకీర్ బాబా, మెహబూబ్, ఇంతియాజ్ అహ్మద్, అస్లాం తదితరులు బాధ్యతలు స్వీకరించారు.ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యత, సోదరభావానికి నిదర్శనంగా ఈ వేడుకను విజయవంతం చేశారు. స్థానిక మత పెద్దలు కూడా ఈ సందర్భంగా మతసౌహార్ధం, శాంతి, ఐక్యత ప్రాధాన్యతను గుర్తుచేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?