రైతాంగానికి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
తుమ్మల విజ్ఞప్తి
Views: 2
On
సత్తుపల్లి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో మంగళవారం ఆయన కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ను కలిశారు.
ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన రెండు లక్షల టన్నుల యూరియా లోటును ఈ నెలలోనే భర్తీ చేయాలని, రాబోయే రబీ సీజన్‌లో ప్రతి నెలా రెండు లక్షల టన్నుల యూరియా నిరంతరాయంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. జియోపొలిటికల్ కారణాల వల్ల కొరత ఏర్పడినప్పటికీ, తెలంగాణ అవసరాలను తీర్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Sep 2025 21:17:00
ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
Comments