మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై తప్పుడు వార్తలు
ఎస్పి కి ఫిర్యాదు చేసిన వనపర్తి బిఆర్ఎస్ సోషల్ మీడియా
వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై ఇందిరమ్మ ఇండ్ల అంశంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు, సంబంధిత మీడియా సంస్థపై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా బిఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు జిల్లా పోలీసు అధికారి వద్ద ఫిర్యాదు చేశారు.
"ఇందిరమ్మ ఇండ్లు బాగున్నాయి" అంటూ తప్పుడు వ్యాఖ్యలు, అసత్య చిట్‌చాట్ పేరుతో నిరంజన్ రెడ్డి గారిపై అవాస్తవ ప్రచారం జరిగిందని వారు ఆరోపించారు. పేద ప్రజలను మభ్యపెట్టి, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో బడ్జెట్ కేటాయించకుండా, ఇళ్ల నిర్మాణ బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలలుగా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి గారిపై తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తూ, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి, బిఆర్ఎస్ విద్యార్థి విభాగ అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్, యువజన విభాగ అధ్యక్షుడు సూర్యావంశం గిరి, మైనారిటీ విభాగ అధ్యక్షుడు జోహెబ్ హుస్సేన్, మండల యువజన విభాగ అధ్యక్షుడు చిట్యాల రాము, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments