చిల్కానగర్ డివిజన్ పార్కులకు మహర్దశ
కోటి రూపాయల ప్రతిపాదనలు చేసిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్
చిల్కానగర్, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ లోని పార్కుల అభివృద్ధి పనులకు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ (యుబిడి) కోటి రూపాయల ప్రతిపాదనలు చేశారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అన్నపూర్ణ తో కలిసి పార్కులను సందర్శించి, కొత్త పనులు వెంటనే సాంక్షన్ చేయాలని కోరారు.బాలాజీ ఎంక్లేవ్ పార్క్ లో కాంపౌండ్ వాల్ మరమ్మత్తు,పెయింటింగ్, నూతన గేట్, వాటర్ బోర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫ్రీడమ్ పార్క్ లో వాకింగ్ ట్రాక్, బెంచీలు, ప్రహరీ గోడ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.నార్త్ కళ్యాణపురి పార్క్ లో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్‌ను బయటకు మార్చాలని, వాచ్మెన్ రూమ్, టాయిలెట్లు పూర్తి చేయాలని, ఆకతాయిలు గంజాయి సేవించడం నివారించేందుకు సీసీ కెమెరాలు అమర్చాలని కోరారు. అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కళ్యాణపురి పార్క్ లో జిమ్ ఎక్విప్మెంట్ అమర్చాలని చెప్పారు.బ్యాంక్ కాలనీ పార్క్ లో వాచ్మెన్ రూమ్, సీసీ కెమెరాలు, పిల్లల ఆట సామగ్రి ఏర్పాటు చేయాలని, టాయిలెట్లను మరోమూలలోకి మార్చాలని కోరారు. రాఘవేందర్ నగర్ పార్క్ లో వాకింగ్ ట్రాక్, గజబో,బెంచీలు,ఓపెన్ జిమ్, ప్లే టేబుల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ పూర్ణ మాట్లాడుతూ, కొత్త ప్రతిపాదనలు త్వరగా సాంక్షన్ చేస్తామని, ఇప్పటికే సాంక్షన్ అయిన పనులను కాంట్రాక్టర్లతో పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్, డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణకి శాల్ తో సత్కారం చేసి, బాలాజీ ఎంక్లేవ్ పార్క్ లో ఏర్పాటు చేసిన గజబో, గార్డెన్ గ్రాస్, బెంచీలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కోకొండ జగన్, వివిధ కాలనీ అధ్యక్షులు, కార్యదర్శులు — జగదీశ్వర్ రెడ్డి, వలి (బాలాజీ ఎంక్లేవ్), శివారెడ్డి, వికాస్ (కళ్యాణపురి), గఫూర్, సందీప్ భూషణ్, వెంకటేశం (బ్యాంక్ కాలనీ) తదితరులు పాల్గొన్నారు.
Comments