ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 

మేడ్చల్ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రత్యేక పూజలో  

ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 

జవహర్‌నగర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు) :

జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ విరాట్ విశ్వ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవుడిని దర్శించుకున్నారు.ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. హోమంలో పాల్గొని విశ్వకర్మ స్వామి ఆశీర్వాదాలను పొందారు.ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ :“దేశ నిర్మాణంలో విశ్వకర్మ కులస్తుల పాత్ర అత్యంత ప్రధానమైనది. శ్రమజీవులు, వృత్తిదారులు, కళాకారులు ఈ దేశ అభివృద్ధికి వెన్నెముకల వంటివారు. వారి కృషి వల్లే మన సమాజం, మన దేశం ముందుకు వెళ్తోంది. విశ్వకర్మ జయంతి వంటి మహోత్సవాలు మన సంప్రదాయాలను కాపాడటమే కాకుండా, సామరస్యాన్ని పెంపొందించే వేదికలుగా నిలుస్తున్నాయి” అన్నారు.అలాగే ఆయన “విశ్వ బ్రహ్మణ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమైనవి. వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బోంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, జవహర్‌నగర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, విశ్వకర్మ కుల పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మహోత్సవం సందర్భంగా దేవాలయం పరిసరాలు పండుగ వాతావరణంలో కళకళలాడాయి. భక్తులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ చేయగా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?