డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ కు అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు ప్రధానం
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 15, తెలంగాణ ముచ్చట్లు;
అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు గ్రహీత. డాక్టర్. లక్ష్మికాంతమ్మ కీ నేషనల్ జానపద కళాకారిణి మరియు బుర్రకథ కళాకారిణిగా సమాజ సేవకురాలిగా గత ఇరవై సంవ త్సరాలుగా ప్రజలతో కలిసి పోతూ తనకు ఉన్న స్వరము తో పాట మాట ఆట తో ఎంతోమంది పేద ప్రజలతో ముందుకి వెళ్ళు చున్న లష్మికాంతమ్మది అనంతసాగర్ గ్రామం చింతకాని మండలం. ఖమ్మం జిల్లా ఈ విధంగా ప్రజలలో ముందుకి వెళ్లుచున్నలక్ష్మికాంతమ్మ కృషిని గుర్తించిన దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ తరుపున విశాఖరత్న కళా పరిషత్ 27 వార్షికోత్సవ వేడుకలు కళాసంబరాల సందర్భముగా అల్లూరి సీతారామరాజు అడిటోరియం లో ఈ అవార్డు ప్రధానం జరిగినది.. కళా భూషణ్ డాక్టర్.. పి. ఏ. భాస్కర్ రావు బుక్ ఆఫ్ రికార్డ్.. ఇండియన్. ఆధ్వర్యములో అవార్డు ప్రకటించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పైడా కృష్ణ ప్రసాద్ చైర్మన్ (విద్యా సంస్థ అధినేత ఏ. పి )డాక్టర్ కేందూరి చంద్ర మౌళి( రిటైర్డ్ ప్రొఫెసర్ ఆంధ్రా యూనివర్సిటీ ) బొమ్మిడిసత్యనారాయణ. విశాఖరత్న అవార్డు గ్రహీత అదేవిధముగా పలువురు సినిమా దర్శకులు నిర్మాతలు. హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.. ఈ సందర్భంగా లష్మికాంతం మాట్లాడుతూ.. చిన్న నాటినుండి నేను కళా రంగంలో ముందుంటూ సామాజిక గేయాలు జానపద గేయాలు బుర్రకథలు.. మరియు ముఖ్యమైన ది సేవ ఈ సేవ లోఎంతో తృప్తి ఉంటుంది మంచి మాట, మంచి బాట ఇలా ప్రజల్లోనే సేవ చేస్తూ సంతోషముగా ఉంటున్నాను నేను ఎంచుకున్న వృత్తి నాకు ఎంతో గౌరవ మర్యాదలు కల్పిస్తున్నందుకు సమాజానికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను అని ఈ సందర్భంగా తెలియజేశారు.
Comments