అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
కీసర, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి. సునీత, మేడ్చల్ ప్రాజెక్ట్ నాయకురాలు దుర్గా మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని,
ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్య తరగతులను అంగన్వాడి కేంద్రాలలోనే నిర్వహించాలనీ, విద్యాబోధన బాధ్యత అంగన్వాడీ ఉద్యోగులకే అప్పగించాలని,ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేసి ఒకే ఆన్లైన్ యాప్ అమలు చేయాలని,5జి మొబైల్ ఫోన్లు అందించాలని,కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రూ.18,000 వేతనం, పిఎఫ్ అమలు చేయాలని,మంత్రి హామీ ఇచ్చిన 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీవో 8 సవరణ తక్షణమే అమలు చేయాలని,పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, మూడు నెలల పిఆర్సి, మినీ టీచర్స్ కు 11 నెలల ఏరియర్స్, రిటైర్డ్ ఉద్యోగులకు 18 నెలల సిబిఇ బకాయిలు వెంటనే చెల్లించాలని,ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.నాయకులు మరోవైపు నూతన జాతీయ విద్యా విధానం కారణంగా ఐసిడిఎస్ నిర్వీర్యం అవుతోందని, ప్రీ ప్రైమరీ తరగతులను విద్యాశాఖకు అప్పగించడం అంగన్వాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేసి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
Comments