భారత స్వాతంత్రోద్యమం అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
కాప్రా, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు)
స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మౌలాలి ఎం.జే. కాలనీలోని కెనడి జేవియర్ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు భారత స్వాతంత్రోద్యమం అనే అంశంపై వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ నాయకురాలు శారద అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుమ్మడి రోజా రాణి మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. భగత్ సింగ్ వంటి యోధులు ప్రాణాలు అర్పించగా, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి నాయకులు చేసిన త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించింది. ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి గుమ్మడి హరిప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు మూఢనమ్మకాల్లో కాకుండా శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి. సైంటిఫిక్ టెంపర్ ద్వారా మాత్రమే మనం సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపించగలము అని సూచించారు.
స్కూల్ ప్రిన్సిపల్ వాణి విజేత విద్యార్థులను అభినందిస్తూ, ఇలాంటి పోటీలు విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తాయని పేర్కొన్నారు.పోటీల విజేతలు:
8వ తరగతి:1వ బహుమతి – ఏ. లక్ష్మీ ప్రియా,2వ బహుమతి – డి. కుందన శ్రీ,3వ బహుమతి – జి.ఎల్.ఎస్.ఎస్. హర్షిని,
9వ తరగతి:1వ బహుమతి – జోబియా తర్విన్,2వ బహుమతి – శ్రేష్ట,3వ బహుమతి – ఎం. చెన్నకేశవ,10వ తరగతి:1వ బహుమతి – శ్రీ సాయి సుప్రీత్,2వ బహుమతి – శ్రీ సాయి కవిత,3వ బహుమతి – వంగూరి లెనార్డ్ సామ్యూల్,విజేతలకు గుమ్మడి హరిప్రసాద్, రోజా రాణి, ప్రిన్సిపల్ వాణి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించారు.
Comments