వనపర్తి విద్యార్థినికి రాష్ట్రస్థాయి గౌరవం
పిజి ప్రవేశ పరీక్షలో పదవ ర్యాంకు సాధించిన నందిపేట గీత
Views: 2
On
వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన నందిపేట గీత రాష్ట్ర స్థాయి తెలంగాణ సాధారణ పిజి ప్రవేశ పరీక్ష–2025 లో ప్రతిభ కనబరచి పదవ ర్యాంకు సాధించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో గీత సామాజశాస్త్రం విభాగంలో ఉత్తమ మార్కులు సాధించి అర్హత పొందింది. సాధారణ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి నందిపేట రాములు ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఈ విజయంతో గీత తన కుటుంబానికే కాకుండా, గ్రామానికి, వనపర్తి జిల్లాకే గర్వకారణంగా నిలిచింది.
ఆమె విజయంపై బంధుమిత్రులు, అధ్యాపకులు, గ్రామ పెద్దలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Sep 2025 21:17:00
ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
Comments