ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ
వనపర్తి,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జెండా ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ, “1948 సెప్టెంబర్ 17న నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యం అంటే మన తెలంగాణ భారత సమాఖ్యలో విలీనమైంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్నాము” అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, గ్రంథాలయం చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వనపర్తి పట్టణ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా విభాగాలు, సోషల్ మీడియా, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ, వక్స్ బోర్డ్ సభ్యులు, ఐఎన్‌టియూసీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments