పలు వివాహ వేదికల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి,సెప్టెంబర్14(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆదివారం వనపర్తి పట్టణంలోని పలు వివాహ వేదికల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వనపర్తి పట్టణం 6వ వార్డుకు చెందిన ఎండి అక్బర్ కుమార్తె వివాహం స్టార్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే వనపర్తికి చెందిన మునీర్ కుమార్తె వివాహం ఆర్‌జి గార్డెన్‌లో జరిగింది. ఈ వేడుకలోనూ ఆయన పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమద్ మియా, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు ఎండి ఇర్షాద్, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments