పెద్దమందడిలో ఘనంగా ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు
పెద్దమందడి,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను పెద్దమందడి మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని సీనియర్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించగా, పార్టీ కార్యకర్తలు, స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. అదేవిధంగా సామాజిక సేవలో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. పెద్దమందడి మండల కేంద్రంలో వందలాది మందికి అన్నప్రసాదం అందజేయడం జరిగింది.
ప్రధాని మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని 75 కిలోల భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు పరస్పరం పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ—పెద్దమందడిలో ఘనంగా ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలున నాయకత్వంలోని అభివృద్ధి ప్రస్థానం ప్రతి కార్యకర్తకు ప్రేరణ" అని పేర్కొన్నారు. అందరి కార్యకర్తల సహకారంతో ఈ వేడుకలు దిగ్విజయంగా ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో అశ్విని రాధ, అశ్విని నందకుమార్, మాజీ మండల అధ్యక్షుడు ఎస్ రమేష్, పెద్దమందడి బాబు, మహేష్, రమేష్ శెట్టి, జి. శ్రీనివాస్ రెడ్డి, జి. సతీష్, రఘువీర్ రెడ్డి, ధర్మేంద్ర సాగర్, జి. నరేష్, అశ్విని శ్రీనివాసులు, రమేష్ గౌడ్, పల్లె రాములు, కె. రామకృష్ణ, ఎస్. రవికుమార్, అశ్విని గోవర్ధన్, అమ్మపల్లి శంకర్ గౌడ్, పెద్దమందడి ధర్మ, సుదర్శన్ రెడ్డి, రాము, జగత్ పల్లి కృష్ణ, మణిగిల్ల కృష్ణ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments