మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ఎనలేని కృషి
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
–ఘనంగా మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 15, తెలంగాణ ముచ్చట్లు;
మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మహిళా కాంగ్రెస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మహిళలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని అన్నారు. మహిళల్ని రాజకీయంగా చైతన్యవంతం చేయాలని ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ నాయకత్వం 1952 లోనే కాంగ్రెస్ పార్టీకి మహిళా సెల్ ను ఏర్పాటు చేసిందని అన్నారు.1983 లో ముంబయి ఏఐసీసీ సమావేశంలో దీనికి పూర్తిస్థాయి స్వతంత్ర సమస్త హోగా ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. అదే నేడు మహిళా కాంగ్రెస్ సంఘంగా ఏర్పాటు జరిగిందని తెలియజేశారు. ద్వారా మహిళలకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడుతూ...మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు రాష్ట్రంలో ఏ పథకం అమలు చేయాలన్న మహిళల పేరు మీదనే అమలు చేయడం మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవ మర్యాదలు ఏంటో తెలుసుకోవచ్చని అన్నారు. మహిళా సెల్ గా ఏర్పడిన మహిళా కాంగ్రెస్ 1984 లో ముంబై లో బెంగుళూరు లో జరిగిన జాతీయ మహాసభలో ఒక ఫ్రాంటల్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా,మండల స్థాయిలో విస్తరించిందని తెలిపారు.అందుకే సెప్టెంబర్ 15న మహిళ కాంగ్రెస్ ఫౌండేషన్ డే గా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరంతో మహిళా కాంగ్రెస్ ఏర్పడి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని అన్నారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు పి సి సి సభ్యులు, జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, కార్పొరేటర్ లకావత్ సైదులు నాయక్,జిల్లా కాంగ్రెస్ నాయకులు మూడుముంతల గంగరాజు యాదవ్, దేవత్ దివ్య, రమా,దామా స్వరూప, బిక్కసాని స్వరూప, ఏలూరి రజని,ఊరుకొండ చంద్రిక,బలుసు లక్ష్మీ, నీలవేణి,భవానీ,నసీమా, రమాదేవి తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments