వనపర్తి జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి – కలెక్టర్‌కు వినతి

వనపర్తి జర్నలిస్టుల నిరసన

వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతిపత్రాన్ని అందజేశారు.
జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వార్తగా ప్రసారం చేసినందుకు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావుపై ఉద్దేశపూర్వకంగా నాన్-బేయిలబుల్ కేసు నమోదు చేయడం నిరసనకు కారణమని ఆయన తెలిపారు.WhatsApp Image 2025-09-15 at 3.48.35 PM
జర్నలిస్టులు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై రాసిన వార్తలకుగాను మీడియాపై అక్రమ కేసులు నమోదు చేయడం మానవ హక్కులకు విరుద్ధమని, కుట్రపూరితంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, ఆనంద్, సుంకరి నగేష్, జగత్ పల్లి శ్రీనివాస్, రాజు, జానీ, సుంకరి రమేష్, గోవర్ధన్, మన్నాజీ, భాను ప్రకాష్, అశోక్, ఈశ్వర్, గోపాల్, చెన్నయ్య, రాధాకృష్ణరెడ్డి, రాములు, అబ్దుల్ హమీద్, ఖలీల్, శ్రీకాంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?