పెండింగ్‌లో ఉన్న రూ,8000 కోట్ల ఫీజులు, ఉపకారవేతనాలు విడుదల చేయాలి

పెండింగ్‌లో ఉన్న రూ,8000 కోట్ల ఫీజులు, ఉపకారవేతనాలు విడుదల చేయాలి

 – ప్రైవేట్ కళాశాలల బంద్‌కు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు

కాప్రా, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, బీఈడీ, ఫార్మా, పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు చెల్లించాల్సిన బోధనా ఫీజులు మరియు ఉపకార వేతనాల బకాయిలు సుమారు రూ,8000 కోట్లు పెండింగ్‌లో ఉండటంతో, వాటిని వెంటనే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది.ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీపీఎం ఏ), ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (ఫతీ) చేపట్టనున్న కళాశాలల బంద్‌కు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి వై జంక్షన్ వరకు చెవిలో పూలు పెట్టుకుని విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ మాట్లాడుతూ, “ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థులను విస్మరించడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయాలి” అని పేర్కొన్నారు.గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజులు విడుదల కాకపోవడంతో ఉన్నత విద్య అభ్యసించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2021-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన రు,7000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు 2025-26కు అదనంగా రూ,1000 కోట్లు అవసరమవుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇంటర్ కళాశాలల్లో 9 లక్షల మంది, డిగ్రీ కళాశాలల్లో 6 లక్షల మంది, ఇంజనీరింగ్ కళాశాలల్లో 1.20 లక్షల మంది, పీజీ కళాశాలల్లో 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో ఎక్కువ మంది ఉపకారవేతనాల మీద ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.
ఫీజులు చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాలలు అధ్యాపకుల జీతాలు ఇవ్వలేక, విద్యార్థులకు సరైన సేవలు అందించలేక నష్టాలు చవిచూస్తున్నాయని, కొన్ని చోట్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.దసరా పండగ లోపు పెండింగ్ బిల్లులను చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, ఉపాధ్యక్షుడు కె. కళ్యాణ్, రాజ్‌కుమార్, మహేష్, విశాల్, నితిన్, కార్తీక్, భరద్వాజ్, రాణా, నదీమ్, కిషోర్, ప్రభాకర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?