వాక్యాధారమైన సమాజ నిర్మాణమే లక్ష్యం
బోధనలో లేఖానుసారమైన ధర్మశాస్త్రము, ఆరాధన దినములు, పండుగలు జరగాలి
◆ నేషనల్ బైబిల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు ప్రొపెసర్ డాక్టర్ యస్. జాన్ రాజ్
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 15 , తెలంగాణ ముచ్చట్లు;
పరిశుద్ధమైన బైబిల్ గ్రంధం ప్రకారం వాక్యాధారమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా నేషనల్ బైబిల్ కాన్ఫరెన్స్(యన్.బి.సి) టీమ్ పనిచేస్తుందని నేషనల్ బైబిల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు, ప్రొపెసర్ డాక్టర్ యస్. జాన్ రాజ్ అన్నారు. ఖమ్మం జిల్లా, వైరా పట్టణం శాంతినగర్ లోని 'యావె సమాజ ప్రార్థన మందిరం'లో సోమవారం ఖమ్మం జిల్లా యన్.బి.సి ఎగ్జిక్యూటివ్ లీడర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ యస్. జాన్ రాజ్ మాట్లాడుతూ... వాక్యాధారమైన బోధలను ఈ సమాజానికి అందించి వారిని సర్వసత్యం వైపు నడిపించుటకొరకు సేవకులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా బైబిల్ కు వ్యతిరేకంగా బైబిల్లో లేని పండుగలు, ఆరాధ దినములు చేయు బోధనలను ఖండించాలి, లేదా వారికి అవగాహన కల్పించాలన్నారు. వచ్చే 2026 సంవత్సరం నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో యన్.బి.సి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. అనంతరం ఖమ్మం జిల్లా యన్.బి.సి ఎగ్జిక్యూటివ్ లీడర్స్ కమిటీని నియమించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా దేవుని సంఘం అధ్యక్షులు టి.వి రావు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ లీడర్(యన్.బి.సి) డాక్టర్ ఐజక్ ఇ.కుసుమ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ లీడర్(యన్.బి.సి), యావె సమాజ సేవకులు, ఎల్డర్ పాలడుగు రత్నపాల్తో పాటు ఖమ్మం జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడర్స్ ను ఎన్నుకోవడం జరిగింది.,అడ్వైజర్ కమిటీ మెంబర్ ఎల్డర్ టి.వి రావు, ఎల్డర్ టి. సత్యవాది, ఎల్డర్ యం. ఎలీషా, ఎల్డర్ జి. దయాకర్, ఎల్డర్ యం.స్టీఫెన్, ఎల్డర్ ఐ. ఇస్సాక్ రాజ్, ఎల్డర్ ఏ. ఆనందం, ఎల్డర్ ఆర్. కరుణాకర్, ఎల్డర్ కె. చిన్నబాబు, ఎల్డర్ టి. శ్యాంసన్ తదితరులు నియమించబడ్డారు. ఈ కార్యక్రమంలో దేవుని సంఘ పాస్టర్లు సువార్తికులు, సంఘస్తులు హాజరైనారు.
Comments